తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గద్వాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమన్నారు. కాంగ్రెస్ సభలు పెడుతుందంటేనే టీఆర్ఎస్‌లో వణుకు పుడుతోందని.. తెరాస ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. నాలుగేళ్ల పాటూ తెలంగాణలో ఎలాంటి పనులు చేశారో అడిగితే చెప్పలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. తెరాస ప్రజలకు మంచి చేస్తే… కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు.. మీరు ఇంట్లో కూర్చుంటే కూడా గెలుస్తారంటూ వ్యాగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా తెలంగాణ ఇస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. ఏ కారణంతోనే తెలంగాణ ఏర్పడ్డదో.. అది జరగడం లేదు అంటూ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్ మోదీ పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నారంటూ విమర్శించారు.