పరీక్ష పేపర్‌పై దేవుడి పేరు రాస్తే ఫెయిలే…!

-

బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయంటే చాలు.. కొంతమందికి గుండెల్లో వణుకు స్టార్టవుతుంది. దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడా.. ప్లీజ్ దేవుడా.. పేపర్ ఈజీగా వచ్చేలా చేయి స్వామీ.. అంటూ వేడుకుంటారు. పేపర్ ఈజీగా వస్తే నీకు వంద కొబ్బరికాయలు కొడుతా అని దేవుడితో బేరం ఆడుతారు. కొందరు విద్యార్థులు మాత్రం తమ ఎగ్జామ్ ఆన్సర్ షీట్‌లో ఏకంగా దేవుడి పేర్లు రాయడం.. ఓంకారం రాయడం లాంటివి చేస్తుంటారు.

పరీక్ష ప్రారంభానికి ముందు అలా కొంతమంది చేస్తుంటారు. అలా ఎక్కడైనా చెల్లుతుందేమో కాని.. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మాత్రం కుదరదు. ఆ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ఇటువంటి పనులు చేస్తే వారిని మాల్ ప్రాక్టీస్ కింద పరిగణించి.. వాళ్లను ఫెయిల్ చేస్తామని హెచ్చరించింది యూనివర్సిటీ యాజమాన్యం. అయితే.. ఇటువంటి సర్క్యూలర్‌ను యూనివర్సిటీ రిలీజ్ చేయడం ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు చాలాసార్లు సర్క్యూలర్‌ను రిలీజ్ చేశామని.. ఈ నిబంధన పాతదేనని అధికారులు చెబుతున్నారు. కాకపోతే.. ప్రతి సంవత్సరం కొత్త విద్యార్థులు వస్తుంటారు కాబట్టి.. వారి కోసం సంవత్సరానికి ఓసారి సర్క్యూలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు యూనివర్సిటీ ప్రకటించింది.

అయితే.. యూనివర్సిటీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందండోయ్. కొందరు విద్యార్థులు అతితెలివితో వాళ్లు వేసే సింబల్స్ ద్వారా తమ ఐడెంటిటీని పేపర్లు దిద్దే ఎగ్జామినర్‌కు తెలియజేస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. ఇదివరకు ఇటువంటివి జరిగాయని.. అప్పటి నుంచి అటువంటి ప్రాక్టీస్‌ను నిషేధిస్తూ సర్క్యూలర్ విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news