12th ఫెయిల్ సినిమాపై IAS ఆఫీసర్ ట్వీట్.. ఇది మీ సక్సెస్ కాదు..

-

బాలీవుడ్ లో ఇటీవల ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ’12th ఫెయిల్’ మూవీ భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటుంది. 2019లో 12th ఫెయిల్ అయిన మనోజ్ కుమార్ శర్మ ఎన్నో కష్టాలుపడి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు అని అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు.

 

మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో నటించిన విక్రాంత్ మాస్సే మనోజ్ కుమార్ శర్మ పాత్రని పోషించారు. ఇక ఈ మూవీ క్లైమాక్స్‌ లో హీరో విక్రాంత్ మాస్సే తన లాస్ట్ అటెంప్ట్ లో ఐఏఎస్ సాధిస్తాడు. ఆ విషయాన్ని తన ఫ్రెండ్తో పాటు సన్నిహితులకు తెలియజేస్తూ ఎమోషనల్ అవుతాడు. ఇక సినిమాలోని ఈ సీన్ గురించి IAS ఆఫీసర్ ‘అవనీష్ శరణ్’ ప్రత్యేక ట్వీట్ చేశారు.

చిత్ర బృందాన్ని ఉద్దేశిస్తూ ……“ఇది కేవలం మీ సక్సెస్ మాత్రమే కాదు. అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, యూపీఎస్సీ పరీక్షలో హాజరయ్యేందుకు ధైర్యాన్ని కూడగట్టుకున్న వారందరి పోరాటాల ఫలితం” అంటూ అవనీష్ శరణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ క్లైమాక్స్ సన్నివేశాన్ని కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ కి హీరోగా నటించిన విక్రాంత్ మాస్సే కూడా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news