ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా అనిల్‌చంద్ర పునిత పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ దినేష్‌కుమార్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్‌గా పునితను ఎంపిక చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పునేఠ రాజంపేట సబ్ కలెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం వివిధ జిల్లాలు, శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు..అందులో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా, ఉద్యాన, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భూపరిపాలన శాఖ (సీసీఎల్ఏ) ప్రధాన కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.