ఏపీలో నూతన భవనాల నిర్మాణంతో పాటూ హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. డిసెంబర్ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొంది. వీటిని అనుసరించే న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైందని ఏపీ ప్రభుత్వం తరపును సీనిర్ అడ్వొకేట్ నారీమన్ కోర్టుకు తెలిపారు.