జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో. కామెడీ స్కిట్లతో అందరినీ కడుపుబ్బా నవ్వించే కామెడీ షో. తెలుగులో మొట్టమొదటి సారిగా మల్లెమాల ప్రొడక్షన్స్ ప్రారంభించింది. సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ను కూడా స్టార్ట్ చేశారు. మరోవైపు ఈ జబర్దస్త్ లో స్కిట్లు చేసిన ప్రతి ఒక్కరికి బోలెడు పేరు, డబ్బు వచ్చాయి. వాళ్లను సినిమా చాన్సులు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. కొంతమందిని టాప్ కమెడియన్లుగా తీర్చిదిద్దింది జబర్దస్త్ వేదిక.
సరే.. జబర్దస్త్ గురించి మాకంటే కూడా ఎక్కువ మీకే తెలుసు. అయితే.. మీకు తెలియని ఓ విషయమే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఏంటది అంటారా? బజర్దస్త్ స్కిట్లలో లేడీ గెటప్ వేస్తుంటాడు కదా… ఎవరు వినోదినా అంటారా? కాదు కాదు.. వినోదిని కాదు. మరో వ్యక్తి సాయి తేజ అని. తెలుసు కదా.. ఎర్రగా… బుర్రగా ఉంటాడు. ఆ.. అతడే. ఇప్పుడు నిజంగానే లేడీ అయిపోయాడు. ఐమీన్.. ట్రాన్స్ జెండర్ గా మారిపోయాడు. ఇప్పుడు అతడి సారీ… ఆమె పేరేంటో తెలుసా? ప్రియాంక సింగ్. అవును.. సాయి తేజ ప్రియాంక సింగ్ గా మారింది. అదంతా ఓకే కానీ.. ఆమె ట్రాన్స్ జెండర్ గా మారాల్సిన అవసరం ఏంటి.. అనే డౌటనుమానం మీకు వచ్చి ఉండొచ్చు. అందుకే.. అసలు.. అతడు ఆమెగా ఎందుకు మారాడు.. దాని వెనుక ఉన్న స్టోరీ ఏందో ప్రియాంక మాటల్లోనే చదువుదాం పదండి.
డబ్బుల కోసమో.. ఇంకో దాని కోసమో నేను ట్రాన్స్ జెండర్ గా మారలేదు. నాకు చిన్నతనం నుంచే ఆడవాళ్ల ఫీలింగ్స్ ఉండేవి. మా ఫ్యామిలీలో కూడా చాలామందికి తెలియదు. మా నాన్నకు తెలియదు. మా అన్నయ్యలకు తెలియదు. కాకపోతే.. ఎప్పుడైనా వాళ్లకు తెలియాల్సిందే నేను మగాడిని కాదని. దాచేది కాదు కదా. అందుకే వాళ్లకు వీళ్లకు అంటూ ఒక్కొక్కరికి చెప్పడం కన్నా అందరికీ ఒకేసారి చెప్పడం బెటర్ అని ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే నాకు లేడీ ఫీలింగ్స్ కలిగేవి. చిన్నప్పటి నుంచి నా చెల్లి డ్రెస్సులు వేసుకునేదాన్ని. కాకపోతే ఇంట్లో ఎవరూ లేనప్పుడు మాత్రమే వేసుకునేదాన్ని. కానీ.. ఎవ్వరికీ నా ఫీలింగ్స్ మాత్రం చెప్పలేదు. నాలోనే దాచుకునేదాన్ని. ఇన్నేళ్లు ఆగాను. ఇక.. నా వల్ల కాలేదు. అందుకే ఆరు నెలల క్రితం ఆపరేషన్ చేయించుకున్నాను. ట్రాన్స్ జెండర్ గా మారాను. అయితే.. ఆపరేషన్ తిరగబడింది. చాలా సమస్యలు వచ్చాయి. ఆర్తరైటిస్ వచ్చింది. చావును చూసి వచ్చాను. కానీ.. దేవుడి దయ వల్ల బతికి బయట పడ్డాను. లక్షలు పోసి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ఇప్పుడు అన్ని సమస్యల నుంచి బయట పడ్డా. నా ఫ్రెండ్సే నన్ను కాపాడారు. వాళ్లు లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాకపోవచ్చు.. అంటూ తన స్టోరీని చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్.