ఓటీటీలోకి రాబోతున్న విక్కీ కౌశల్ ‘సామ్ బహదూర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

-

మేఘనా గుల్జార్ ద‌ర్శక‌త్వంలో బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్‌ ప్ర‌ధాన పాత్రలో న‌టించిన తాజా చిత్రం ‘సామ్ బహదూర్’ . డిసెంబ‌ర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.130 కోట్ల వ‌ర‌కు వసూళ్లు రాబ‌ట్టింది.ఈ సినిమాను రోనీస్క్రూవాలా నిర్మించాడు.

 

ఈ చిత్రం ఓటీటీ లో విడుదల కావడానికి సిద్ధమవుతుంది.రిప‌బ్లిక్ డే కానుక‌గా ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గజం జీ5లో ఈ చిత్రం జ‌న‌వ‌రి 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 ఎక్స్‌లో ప్ర‌క‌టించింది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్న సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా ఈ చిత్రం వ‌చ్చింది. ఇక సామ్మానెక్షా పాత్ర‌లో విక్కీ కౌశల్ నటించాడు.ఇక విక్కీ కౌశల్ భార్యగా సన్యా మల్హోత్రా నటించింది.అలాగే ఇందిరా గాంధీ పాత్రలో సనా ఫాతిమా షేక్ నటించింది. 1934 నుంచి 1973 వరకూ ఆర్మీలో త‌న సేవ‌లు అందించిన‌ సామ్ బహదూర్’ని ఇండియన్ గవర్నమెంట్ ‘పద్మ భూషణ్’, ‘పద్మ విభూషణ్’ పురస్కారాలతో సత్కరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version