అయోధ్య రామాలయానికి 14 ఏళ్ల బాలిక రూ.52లక్షల విరాళం

-

ఆయోధ్య లో శ్రీరాముని రామ మందిరం నిర్మాణానికి ఎంతోమంది ప్రముఖులు తమవంతుగా విరాళాలు ఇచ్చారు. అలాగే సామాన్య భక్తులు కూడా తమకు తోచిన విరాళం ఇచ్చారు. అయితే.. ఇటీవల గుజరాత్ లో నీ సూరత్ కు చెందిన భవికా మహేశ్వరి అనే14 ఏళ్ల బాలిక రామ మందిరానికి రూ. 52 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఇంత చిన్న వయసులోనే పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చినందుకు బాలిక రామ భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.

భవిత రామ మందిర నిర్మాణం గురించి విని ,దాని విశేషాలను తెలుసుకొని, ప్రజలందరూ రాముని మందిరానికి విరాళాలు ఇస్తున్నారనే విషయం తెలుసుకొని తాను కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. భవిక 11 ఏళ్ల వయసు లోనే 50 వేల కిలోమీటర్లు నడిచి 300కు పైగా ప్రదర్శనలు ఇచ్చి,రాముని కథలు చెప్పింది . తను చదివిన కథలను లాజ్పూర్ జైలు, బహిరంగ ప్రదేశాలలో చెప్పింది. 2021 సంవత్సరంలో లాజ్పూర్ జైలులోని 3200 మంది ఖైదీలకు శ్రీరాముని కథలు చెప్పగా వారు రూ. లక్ష విరాళంగా ఇచ్చారు. ఇలా చేసి భవిత రూ. 52 లక్షల వరకు సేకరించి ఆ మొత్తాన్ని రామ మందిరం నిర్మాణానికి ఇచ్చింది. 108 పైగా రాముని వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్ లో అందుబాటులో ఉంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version