కర్నూలు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మూడు వారాల్లోనే 11 మందిని పొట్టన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వైద్యం అందిస్తున్న వారిని సైతం స్వైన్ ఫ్లూ మహమ్మారి వదిపెట్టడం లేదు…ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖలో ఇద్దరికి, స్థానిక మెడికల్ కళాశాల ప్రొఫెసర్‌కూ సోకింది. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు వైద్యుల సలహా మేరకు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతుండగా, ప్రొఫెసర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో అలెర్ట్ ప్రకటించారు.