కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై రాళ్లదాడి…

-

ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందుతున్న వంశీచంద్ రెడ్డి


కాంగ్రెస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్ మండలం జంగారెడ్డి పల్లిలో ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వంశీచంద్ వెళ్తుండగా, వాహనంపైకి రాళ్లు విసిరారు. దీంతో వాహనం అద్దాలు ధ్వంసమై వంశీ చంద్ కళ్లలోకి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. వంశీచంద్ తలకు, చేతులకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ముక్కలో నుంచి రక్తం కూడా కారుతోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్టు సమాచారం.

అయితే ఈ దాడికి పాల్పడింది భాజపా కార్యకర్తలేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో జంగారెడ్డిపల్లిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వంశీ చంద్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version