కాంగ్రెస్ కు బాబర్ అంటేనే ప్రేమ…. రాముడిపై కాదు-హిమంత్ బిశ్వ శర్మ

-

ఈ నెల 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ రంగాల్లో ప్రముఖులు 7000 మంది అతిథులుగా హాజరు కానున్నారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో పాటు దేశమంతట పండగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలైన సోనియాగాంధీ,మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరిలను ఆహ్మానించినప్పటికీ తాము హాజరు కావడం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి బాబర్ అంటేనే ప్రేమ కానీ రాముడంటే ప్రేమ లేదని ఆయన అన్నారు. వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే తప్పని హిమంత బిశ్వ శర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాముడు, బాబర్ పక్కపక్కన ఉంటే.. కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుగా బాబార్ కే నమస్కరిస్తారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ తన పాపాలను తగ్గించుకోవడానికి విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన అవకాశాన్ని వారు వదులుకున్నారని ఆయన అన్నారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు రామమందిరాన్ని వ్యతిరేకిస్తున్నారని , వీళ్లందరూ ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి బాబార్ సమాధిని దర్శిస్తారు తప్పితే రామమందిరానికి రారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు హిమంత బిశ్వ సర్మ మాట్లాడుతూ.. గతంలో సోమనాథ్ ఆలయ విషయంలో జవహర్ లాల్ నెహ్రూ ఈ విధంగానే వ్యవహరించాడని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news