గత కొన్నాళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘బయోపిక్’ సినిమాల బాటలో మరో చిత్రము రాబోతున్నది. భారత క్రికెట్ గమనాన్ని, గమ్యాన్ని మార్చిన సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలో పట్టా లెక్కనున్నట్లు సమాచారం. అభిమానులంతా ‘బెంగాల్ టైగర్ ‘,‘దాదా’, ‘కోల్‌కతా ప్రిన్స్’ అని పిలుచుకునే గంగూలీ బయోపిక్‌లో దాదా పాత్రను అయుష్మాన్ ఖురానా పోషించబోతున్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రము.. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
లవ్ రంజన్, అంకుర్ గార్గ్‌లు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. ప్రస్తుతం మోత్వానీ, ఖురాన లు గంగూలీ బయోపిక్ కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దాదా మాదిరిగానే హావబావాలు, అతడు ఆడే విధానం, తదితర అంశాలపై ఆయుష్మాన్ ఖురాన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాకాలు చేస్తున్నరు.సచిన్ టెండూల్కర్,మహేంద్ర సింగ్ ధోని,కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, మిథాలీ రాజ్ వంటి క్రికెటర్లతో పాటు బాక్సర్ మేరీ కోమ్ బయోపిక్ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. భారత క్రికెటర్‌గా, కెప్టెన్‌గానే గాక బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన దాదా జీవితాన్ని మోత్వానీ ఎలా తెరకెక్కిస్తాడోనని అతడి అభిమానులు వేచి చూస్తున్నారు. మోత్వాని గతంలో బాంబే వెల్వెట్, ఉడ్తా పంజాబ్,ఉడాన్ లూటేరా, ఎన్‌హెచ్10 వంటి హిట్చిత్రాలకు దర్శకత్వం వహించాడు.