
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. తెరాస అధినేత కేసీఆర్ మందస్తు ఎన్నికల ప్రకటన అనంతరం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు కోసం పట్టు పట్టి ..తెరాసపై విమర్శలు చేసి కాంగ్రెస్ గూటికి చేరిన కొండా సురేఖకు పరకాల ప్రజలు ఓట్ల రూపంలో వారి అభిప్రాయాలు తెలిపారు. 2014లో పరకాలలో తెదేపా నుంచి గెలిచిన చల్లా ధర్మారెడ్డి ఈ సారి తెరాస నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు.