కోటి రూపాయల నగదు…కీలక డాక్యుమెంట్లు స్వాదీనం?

-

తెలంగాణ కాంగ్రెస్  వర్కింగ్ ప్రెసిడెంట్  రేంవత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు శుక్రవారం (సెప్టెంబరు 28) కూడా కొనసాగుతూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం  ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రెండోరోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

దాదాపు 10 గంటలకు పైగా రేవంత్ రెడ్డి నుంచి ఐటీ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో సంబంధమున్న సెబాస్టియన్, ఉదయ్ సింహా ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సెబాస్టియన్‌కి సోమవారం లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంట్లో కోటి రూపాయలు నగదు, కీలక డాక్యుమెంట్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news