అవిసె గింజల జెల్ తో స్కిన్ పై ముడతలు రావు. .జుట్టు రాలదట..! సైంటిఫిక్ గా తేలిన విషయాలు ఇ‌వే

-

ఈరోజుల్లో ఎండ తగలనందువల్ల, కొన్నిరకాల పోషకాహాల లోపల వల్ల , పొల్యూషన్ వల్ల కానీ, విటమిన్ b12లోపం వల్ల, ధైరాయిడ్ లోపం వల్ల కానీ జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, ఎదగకపోవడం, జుట్టుకుదుళ్లు బలహీనంగా అవటం లాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి ఎన్నోరకాలు ఆయిల్స్, షాంపూలు వాటి వేలకు వేలు డబ్బులు ఖర్చుపెట్టినవాళ్లూ ఉన్నారు. మనకు ఏదైనా సమస్య ఉంది అంటే..సలహాలు ఇచ్చే వాళ్లు ఎక్కువైపోతారు..అవి ఎంతవరకూ వర్కౌట్ అ‌వుతాయో కూడా మనం ఒక దశ వచ్చేసరికి అంచనావేసుకోలేకపోతాం..చేసి చూద్దాం తగ్గుతుందేమోలే అనుకుని తెగ ప్రయత్నిస్తాం. ఈరోజు ఇలాంటి జుట్టు సమస్యసలకు సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన ఒక పరిష్కారం గురించి తెలుసుకుందాం.

2016వ సంవత్సరంలో సీఎస్కే హిమాచల్ ప్రదేశ్ కృషి విశ్వవిద్యాలయ- ఇండియా( CSK Himachal Pradesh Krishi Vishvavidyalaya- India) వారు పరిశోధన చేసి ఫ్లాక్ సీడ్స్ జెల్ జుట్టుకు, స్కిన్ అప్లైయ్ చేస్తా చాలా చక్కటి ఫలితాలు వస్తాయని నిరూపించారు. జుట్టు ఊడటం ఆపడాన్ని, జుట్టు త్వరగా ఎదిగేటట్లు చేయడానికి, జుట్టు పగలకుండా, విరగకుండా, డ్రైనెస్ రాకుండా చేయడానికి ఈ ఫ్లాక్ సీడ్ జల్ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధన చేసి ఇచ్చారు.

అవిసె గింజల జెల్ ఎలా తయారుచేసుకోవాలి?

అవిసె గింజలు చాలా జిగురుగా ఉంటాయి. ఒక కప్పుడు అవిసె గింజలు తీసుకుని..నాలుగు కప్పులు నీళ్లు పోసీ రాత్రంతా నానపెట్టండి. సుమారుగా 12 గంటలు నానాలి. తెల్లారి..ఈ గింజలను ఆ నీళ్లతోనే కలిపి..10-15 నిమిషాలు మరగనివ్వండి. మరిగేసరికి అవిసెగింజల్లో ఉండే పోషకవిలువలు అన్నీ ఆ నీళ్లలోకి వచ్చేస్తాయి. జెల్ లాగా అ‌వుతుంది. చల్లారనిచ్చి..గింజలు తీసేసి ఆ జెల్ ను వాడుకోండి. చేత్తోనే గింజలు తీయండి..క్లాత్ పెట్టి తియడానికి అవదు. ఈ జెల్ ను జుట్టుకు, ఫేస్ కు అప్లైయ్ చేసుకోవచ్చు.

జెల్ రాయం వల్ల ఉండే లాభాలు:

తలకు ఒక అరగంట నుంచి గంటపాటు ఉంచుకుని స్నానం చేయాలి. ఇందులో ఉన్న ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్ అనేది విటమిన్ Eతో కలిసి పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి.. జుట్టు కుదళ్ల దగ్గర ఉండే కణజాలాన్ని రక్షించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ కణజాలం డామేజ్ అయిందో.. జుట్టు కుదుళ్లు బలహీనం అయిపోతాయి.. తద్వారా కొత్త జుట్టురాదు, జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. డైరెక్టుగా ఈ ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్స్ వెళ్లి.. కుదుళ్లుకు డైరెక్టుగా మేలు చేస్తాయి.

జుట్టుకుదుళ్ల దగ్గర ఉండే కణజాలన్ని మన శరీరంలో కొన్ని ఫ్రీరాడికల్స్ డామేజ్ చేస్తాయి. ఆ డామేడ్ చేయకుండా రక్షించానికి.. ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ E కాంబినేషన్ పనిచేస్తుందని అధ్యయనంలో ఇవ్వటం జరిగింది.

అవిసె గింజల్లో లిగ్నాన్స్( Lignin) అవి ఎక్కువగా ఉంటాయి. ఆడవారిలో మగహార్మోన్స్ పెరగటం, మగవారిలో ఆడవారి హార్మోన్స్ పెరిగి జుట్టు ఊడిపోతుంది. హార్మోన్ డిస్టబెన్స్ వల్ల ఇలా జరుగుతుంది.. దీన్ని కంట్రోల్ చేయడానికి అవిసె గింజల్లో ఉండే లిగ్నాన్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తున్నాయట. ఇంకా ఇవి ఏం చేస్తాయంటే..వెంట్రుక ఊడిపోతే.. ఆ జుట్టుకుదుళ్లనుంచి హెయిర్ పోలికల్ మళ్లా పట్టాలంటే.. సుమారుగా 21రోజులు పడుతుంది. అనారోగ్యంగా ఉన్నా, పోషకవిలువలు సరిగ్గా అందకున్నా ఇంకా ఎక్కువరోజులే పడుతుంది. ఈ లిగ్నాన్స్.. జుట్టుకుదుళ్లన్నింటిని యాక్టివేట్ చేసి త్వరగా జుట్టు వచ్చేట్లు చేస్తుంది.

ఇంకా అవిసె గింజల్లో ఉండే మెగ్నీషియం( Magnesium), సిలీనియం ( Selenium), విటమిన్ బీ, విటమిన్ ఈ, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల తలలో ఉండే సెల్స్ ను బలపరిచి రక్తప్రసరణ పెంచి జుట్టు కుదుళ్లు బలపడేట్లు చేయడానికి ఈ పోషకాలు బాగా ఉపయోగుడుతున్నాయి కాబట్టి హెయిర్ గ్రోత్ బాగుంటుంది.

ఈ జెల్ అప్లైయ్ చేయటం వల్ల జుట్టును డ్రై అవకుండా చేసి.. జుట్టు పగలకుండా, విరగకుండా, స్మూత్ గా చేసేట్లు చేయడానికి ఉపయోగపడుతుందని సైంటిఫిక్ స్టడీలో ఇచ్చారు.

మనం అందరం. అవిసెగింజలు కారంపొడి, ఉండలు చేసుకుని తింటాం.. ఈ జెల్ ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఇలా కూడా ట్రే చేయొచ్చు. అవిసె గింజలను చేతులకు, మెడకు, ముఖానికి అప్లై చేయటం వల్ల స్కిన్ లో ఉండే కొలాజన్ డామేజ్ అవకుండా.. స్కిన్ ఫోల్డ్స్ రాకుండా.. రక్షిస్తుంది. పరిశోధన ద్వారా నిరూపించబడింది కాబట్టి ఇంట్లోనే అవిసె గింజల జెల్ ను తయారుచేసుకుని వాడుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news