క్రెడిట్ కార్డులని తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

-

మీరు కొత్త క్రెడిట్ కార్డుని తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకోసం ఇప్పుడు అదిరిపోయే క్రెడిట్ కార్డు అందుబాటు లోకి వస్తోంది. మరి ఇప్పుడే పూర్తి వివరాలని తెలుసుకోండి. తాజాగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సూపర్ ఫీచర్ల తో క్రెడిట్ కార్డులుని తీసుకు రావడానికి సిద్ధం అయ్యింది.

 

ఇది ఇలా ఉండగా కేవలం 9 శాతం వడ్డీ రేటు తో క్రెడిట్ కార్డులు తీసుకు రావడం మరో విశేషం. ఒకవేళ క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు కనుక తీసుకున్నట్లయితే…  45 రోజుల వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయక పోవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్‌ లో చాలా బ్యాంకులు ఏడాదికి 40 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. అయితే కేవలం 9 శాతం వడ్డీ రేటు తో క్రెడిట్ కార్డులు తీసుకు వస్తే మాత్రం అది సెన్సేషన్ అవుతుంది.

అలానే ఈ కార్డు పై ఎలాంటి వార్షిక ఫీజు కూడా ఉండక పోవచ్చు అని అంటున్నారు. ఈ కార్డు మీద వచ్చే మరో బెనిఫిట్ ఏమిటంటే.. రివార్డు పాయింట్లు ఎప్పటికీ కూడా ఎక్స్‌పైరీ అవ్వక పోవడమే. తక్కువ వడ్డీ రేటు అనేది అందరు కస్టమర్లకు వర్తించక పోవచ్చు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వారికే ఈ బెనిఫిట్ లభిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులు అందరికీ అందుబాటు లోకి రావొచ్చు అని చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version