విశాఖజిల్లా పాయకరావుపేటలో సవాళ్ళ రాజకీయం మొదలైంది. ఉపమాక వెంకన్న సాక్షిగా ఎమ్మెల్యే అవినీతిని నిరూపించేందుకు సిద్ధమని టీడీపీ ప్రకటించింది. నియోజకవర్గం అభివృద్ధిని జనం మధ్యలో చర్చించేందుకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసురుతోంది. టీడీపీ అభియోగాలపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించడంతో వాతావరణం క్రమేపీ వేడెక్కుతోంది.
విశాఖ జిల్లా రాజకీయాలను సవాళ్ళ పర్వం రక్తికట్టిస్తోంది. తూర్పు నియోజకవర్గంలో రెండు
రోజుల హైడ్రామా మరుగున పడక ముందే, ఇప్పుడు పాయకరావుపేట వంతు వచ్చింది. ఇక్కడ అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్చ కోసం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎమ్మెల్యే సచ్చీలతను నిరూపించుకునేందుకు ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
రిజర్వ్డ్ నియోజవర్గమైన పాయకరావు పేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావు. అధిష్టానానికి
కి విధేయుడనే ముద్ర వున్న బాబూరావవు..ఈ స్ధానం నుంచి మూడో పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, గొల్లబాబూరావుల మధ్య ఇటీవల పచ్చిగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తున్న అనిత వాటిని నిరూపించేందుకు సిద్ధమని ప్రకటించారు.
తెలుగుదేశంపార్టీ చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే గొల్లబాబూరావు ఘాటుగా స్పందించారు. అనితకు గట్టి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే. అవినీతిపరులే ఎదుటివారిపై విమర్శలు చేస్తారని…ఉనికిని కాపాడుకోవడానికి తాపత్రయం తప్ప మరొకటి లేదని మండిపడుతున్నారు. అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షం, ఉపమాక వెంకన్న సాక్షిగా నిరూపిస్తే ..అందుకు తానూ సిద్ధమేనని సవాల్ విసురుతున్నారు.
టీడీపీ, వైసీపీల మధ్య సవాళ్ళు, ప్రతిసవాళ్ళు అభివృద్ధి,అవినీతి చుట్టూ తిరగడం స్ధాని
కంగా చర్చనీయాంశంగా మారింది. అభియోగాలకు ఆస్కారం లేకుండా, ఎవరి హయాంలో ఏం చేశామో చెప్పుకోవడానికి జనం ముందుకు వెళ్దామనే చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది.