గ్రాండ్ గా సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ ఎంగేజ్మెంట్ వేడుకలు….

-

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు . అయితే సాయి పల్లవి సిస్టర్ ‘పూజ కన్నన్’ ఆమె పోలికలతోనే కనిపిస్తూ అభిమానులని ఆకట్టుకుంటుంటారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూజకి ఇన్‌స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగే ఉంది.

 

ఇది ఇలా ఉంటే, పూజ కన్నన్ తన సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ వేశారు. ఆ పోస్టులో తన ప్రియుడిని పరిచయం చేసింది.అలా ప్రియుడిని పరిచయం చేసి వారం అయ్యిందో లేదో.. అప్పుడే ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు రోజుల క్రితమే తమ ఎంగేజ్మెంట్ అయ్యిందని పూజా కన్నన్ తెలిపారు.జనవరి 21న ఆదివారం నాడు ఈ నిశ్చితార్థం జరిగినట్లు పూజ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. తన ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది అందులో సాయి పల్లవి కుటుంబం మొత్తం కనిపిస్తుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోయే ఈ నూతన జంటకు నేటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news