గ్రీన్ ఛాలెంజ్ చిరు.. పవన్ సై..సై..!

-

ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి ఏదైనా ఒక కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్లాలంటే ముందు సెలబ్రిటీస్ తో చేయిస్తే బెటర్ అన్న ఆలోచన వచ్చింది. అలా ఆలోచన రావడమే ఆలస్యం ఒకరికి ఇంకొకరు చేయదలచుకున్న పనిని ఛాలెంజ్ విసురుతారు. లేటెస్ట్ గా తెలంగాణా హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ హంగామా నడుస్తుంది. తెలంగాణా మంత్రి కే.టి.ఆర్ తాను మొక్కలు నాటి మహేష్ తో పాటుగా మరో ఇద్దరికి ఈ ఛాలెంజ్ విసిరాడు. కాస్త లేట్ అయినా మహేష్ కూడా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు.

లేటెస్ట్ గా ఎన్.టి.వి నరేంద్ర చౌదరి మెగాస్టార్ చిరంజీవికి ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు. వెంటనే చిరు తన ఇంట్లో మొక్కలు నాటుతూ పిక్ షేర్ చేశాడు. అంతేకాదు తన తమ్ముడు పవన్, రామోజి రావు ఇంకా బిగ్ బి అమితాబ్ లకు చిరు ఈ గ్రీన్ ఛాలెంజ్ ను విసిరాడు. అన్న ఆదేశించాడో లేదో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన పవన్ మొక్కకు నీళ్లు పోస్తూ ఓ పిక్ షేర్ చేశాడు. మొత్తానికి అలా చిరు, పవన్ సై.. అంటే సై అని హరితహారం ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news