చోటా టిఫెన్‌..బడా ప్రాఫిట్‌..రూ. 5వేల పెట్టుబడితో నెలకు రూ. 60 వేలు..

-

ఏదైనా వ్యాపారం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అనుకుంటున్నారా..? పెట్టుబడి తక్కువగా ఉండి..లాభాలు ఎక్కువగా వచ్చే వ్యాపారాలు చాలా ఉన్నాయి.. కాస్త మెండ్ పెట్టి కష్టపడితే చాలు..ఈజీగా చేసేయొచ్చు.. కేవలం రూ. 5వేల పెట్టుబడితో నెలకు రూ. 60వేలు సంపాదించే మంచి బిజినెస్‌ ఐడియా ఉంది. అదేంటంటే..!
ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఏం కావాలన్నా ఆన్‌లైన్లు..తినేవి కూడా ఇంటి దగ్గర ఉండే ఆర్డర్‌ చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు ఆన్లైన్ ఫుడ్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. అయితే.. ఆన్లైన్లో బిర్యానీలకు ఉన్నంత డిమాండ్‌ టిఫిన్‌కు ఉండదు. చాలామంది ఆన్‌లైన్‌లో టిఫెన్‌ ఆర్డర్‌ పెట్టుకుని తినరు..ఎందుకంటే.. ఆన్‌లైన్‌లో ప్లేట్‌ టిఫెన్‌ కాస్ట్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ టిఫిన్ వ్యాపారాన్ని ప్రారంభించడం బెస్ట్ ఐడియాగా చెప్పొచ్చు. అయితే జొమాటో, స్విగ్గీలా అంత ధర ఉండొద్దు.. బాబాయ్‌ టిఫెన్ సెంటర్లా ఉండాలి. సామాన్యులకు అందుబాటులో ఉండేలా అయితే మీ బిజినెస్‌కు మంచి గిరాకీ ఉంటుంది.
మీరు ఉన్న లొకాలిటీలో..టిఫెన్‌ సెంటర్‌ పెట్టి..ఆన్‌లైన్‌ ద్వారా ప్రమోట్‌ చేసి..ఒకరిద్దరిని పెట్టుకుని టిఫెన్‌ డోర్‌ డెలివరీ చేస్తే చాలు.. దీనికి ఏం యాప్స్‌ అక్కర్లా..మౌత్‌ టాక్‌ ఇంకా సోషల్‌ మీడియా చాలు..మన వ్యాపారం గురించి అందరికి తెలియడానికి..మీరు ఉన్న ఏరియా నుంచి నాలుగు ఐదు కిలోమీటర్ల వరకు సర్వీస్‌ చేసేలా పెట్టుకోండి. ఆర్డర్లు పెరిగేకొద్ది..దూరం పెంచి డెలివరీ బాయ్స్‌ను రిక్రూట్‌ చేసుకుంటే సరి..!
మంచి వంట మాస్టర్ ను మాత్రం నియమించుకోవాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేసే వారు, కరోనా కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి ఇష్టపడని అనేక మందికి ఈ వ్యాపారం ద్వారా సేవలు అందించవచ్చు. ఇంట్లోంచి బయటకు వచ్చి హోటల్‌లో టిఫెన్‌ చేస్తే ఎంత అవుతుందో..మీ దగ్గర ఆర్డర్‌ పెట్టినా అంతే అయ్యేలా చూసుకోండి. అలా అని మనం నష్టాల్లో వ్యాపారం నడపక్కర్లేదు. మీరు కేవలం ఐదు కిలోమీటర్లే పెట్టుకున్నారు కాబట్టి..పెట్రోల్‌ ఎక్కువ కాదు..ఇంకా ముందు రోజే చెప్పే ఆప్షన్‌ కూడా ఇచ్చారంటే..ఇంకా బాగుటుంది. కష్టమర్స్‌ ముందు రోజు రాత్రే ఏం కావాలో బుక్‌ చేసుకుంటారు..మీరు అన్నీ కలిపి ఒకేసారి డెలివరీ చేసి రావొచ్చు. కేవలం క్వాలిటీ, క్వాంటిటీ మెయింటేన్‌ చేస్తే చాలు..
ఈ బిజినెస్ బాగా క్లిక్ అయితే.. రోజుకు రూ.2 వేలు, నెలకు రూ.60 వేల వరకు సంపాధించే అవకాశం ఉంటుంది. సాయంత్రం స్నాక్స్ కూడా డెలివరీ చేయొచ్చు. కస్టమర్లను ఇంప్రెస్ చేయగలిగితే మీకు లక్షలు ఖర్చుపెట్టినా దొరకని మంచి మౌత్ పబ్లిసిటీ లభిస్తుంది. ఒకసారి ఆలోచించి చూడండి..ఖాళీగా ఉంటున్నాం ఎవరూ జాబ్‌ ఇవ్వడం లేదు..ఇచ్చినా చేసే ఉద్దేశం లేదు అనుకునే ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ ఉంటుంది కదా.. అలాంటి వారికి ఈ బిజినెస్‌ ఐడియా బానే ఉంటుందేమో..!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version