‘రా.. కదలిరా!’ అన్న పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలి రా’ అని ఇచ్చిన నినాదానికి జనం నుంచి మంచి స్పందన వస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఉరవకొండలో జరుగుతున్న టీడీపీ ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నానని, చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘వైసీపీ సినిమా అయిపోయింది. వచ్చి అసెంబ్లీ ఎన్నికలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా ఆ పార్టీ నేతలు పారిపోతున్నారు. జగన్, ఆయన చెల్లి కొట్టుకుంటే నేను కారణమా? రాష్ట్రంలో నాకు అందరూ స్టార్ క్యాంపెయినర్లే. జగన్లా నేను మోసం చేయను. ఆయన వల్ల అందరూ నష్టపోయారు’ అని విమర్శించారు.