గుత్తా జ్వాల ఓటు మిస్సింగ్ పై స్పందించిన రజత్ కుమార్…

-

బ్యాడ్మింటన్ ప్రముఖక్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైన విషయం పై తెలంగాణ ఎన్నికలప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. శుక్రవారం ఉదయం ఓటు హక్కువినియోగించుకోవడానికి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా..ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో గుత్తా జ్వాల  షాకయ్యారు. దీంతో ఎన్నికల ముగిసిన తర్వాతతెలంగాణ ఎన్నిక ప్రధాన అధికారి రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…  గుత్తా జ్వాల పేరు 2015 జాబితానుంచి గల్లంతయిందని వెల్లడించారు.

క్రీడాకారిణి పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతోసంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) నుంచి నివేదిక కోరామని రజత్వివరించారు. ఓటర్ల పారదర్శకతపై ప్రశ్నించడంతో పాటు #whereismyvoteఅని తన బాధను వెల్లగక్కుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోఅధిక మొత్తం ఓట్ల గల్లంతైనట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version