ఇది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే.. 114 ఏళ్ల బామ్మ అంటే ఎలాఉంటుంది చెప్పండి. కనీసం నడవడం కాదు కదా.. వాళ్లు మంచంలో నుంచి లేవడం కూడాఇబ్బందే. అటువంటిది ఓ బామ్మ.. 114 ఏళ్ల వయసు.. ఆమెతో పాటు 90 ఏళ్ల వయసు ఉన్న ఆమెకూతురు ఇద్దరు కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. వీళ్లను నేటి యూత్ఆదర్శంగా తీసుకోవాలి.. ఏమంటారు.
తెలంగాణతో పాటు రాజస్థాన్ లో కూడా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోనే 114 ఏళ్ల బామ్మ, ఆమె కూతురు నడవలేని స్థితిలో ఉన్నా… వాహనంలో వచ్చి మరీ.. పోలింగ్ అధికారుల సహాయంతో ఓటేసి వెళ్లారు. అబ్బ.. అది కమిట్ మెంట్ అంటే.. అది బాధ్యత అంటే. రాజస్థాన్ లో మాత్రం పోలింగ్ లో శతాధిక వృద్ధులు చాలామంది ఎంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. అది నిజంగా హర్షించదగ్గ విషయం. అంతే కాదు.. ఈసారి రాజస్థాన్ లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది.