టూరిజంలో మాల్దీవులతో ఢీ.. లక్షద్వీప్ కు అదనపు విమానాలు

-

ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ఇండియా తన వ్యూహాత్మక నిర్ణయాలతో సమాధానమిస్తోంది. లక్షద్వీప్ లో మాల్దీవులకు ధీటుగా టూరిజంను డెవలప్ చేయడంపై ఇండియా దృష్టి పెట్టిందనేలా ఈ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. లక్షద్వీప్ కు సేవలందిస్తున్న ఏకైక విమానయాన సంస్థ ‘అలయన్స్ ఎయిర్’ తాజాగా లక్షద్వీప్ కు వెళ్లే టూరిస్టులు, ప్రయాణికుల సౌకర్యార్ధం ఇకపై అదనపు విమానాలను నడుపుతామని కీలక ప్రకటన చేసింది.

 

ప్రస్తుతానికి తాము లక్షద్వీపుకు 70 సీట్లు కలిగిన ఒకే ఒక విమానాన్ని నడుపుతున్నామని పేర్కొంది. ఒకే ఒక విమాన సర్వీసు ఫుల్ కెపాసిటీతో రోజూ నడుస్తోందని తెల్పింది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్చి వరకు విమాన టికెట్లన్నీ బుక్ అయ్యాయని వెల్లడించింది. ఇకపై అదనపు విమాన సర్వీసులను నడపాలని డిసైడ్ చేశామని ‘అలయన్స్ ఎయిర్’ తెల్పింది . అదనపు విమానాలను ఆది, బుధవారాల్లో నడిపిస్తామని పేర్కొంది. ఈ సంస్థ కేరళలోని కొచ్చి నుంచి లక్షద్వీప్లోని అగట్టి ద్వీపానికి విమాన సర్వీసులు అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news