CM Revanth Reddy: పది రోజులు సీఎం రేవంత్ బిజీ.. ఢిల్లీ టు దావోస్ వయా మణిపూర్..!

-

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు బిజీ కానున్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత పార్టీ సమావేశంలో పాల్గొని మల్లికార్జున్ ఖర్గే,సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం మణిపూర్ వెళ్లి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్ కి బయలుదేరుతారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న తర్వాత మరో మూడు రోజులు లండన్లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక స్విట్జర్లాండ్లోని దావోస్ కి ప్రతి సంవత్సరం వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతున్నారు. గౌతమ్ అదానీ,ముకేశ్ అంబానీ, కుమారమంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా… వంటి పారిశ్రామికవేత్తలతో పాటు ఈ సదస్సులో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.

 

అయితే ఈ ఏడాది రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి 18 వరకు దావోస్లో పర్యటించనున్నారు. విదేశీ పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించే ఉద్దేశంతో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు, లండన్ పర్యటనలో పాల్గొంటున్నారు. ముఖ్య మంత్రి రేవంత్ తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎంవో కార్యదర్శులు, ఓఎస్టీ,పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు దావోస్ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత ఈ నెల 23న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం హైదరాబాద్ కు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news