తప్పుచేశామని భావిస్తే ఓటు వేయొద్దు: మంత్రి బొత్స సత్యనారాయణ

-

మరి కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి .ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు కసరత్తులు ప్రారంభించాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము తప్పు చేశామని భావిస్తే మళ్లీ ఓటు వేయొద్దని అన్నారు.విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజాయితీతో రాజకీయాలు చేశామన్న ధైర్యం తమకు ఉందని చెప్పారు. తనకు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ అవకాశం ఇచ్చారన్నారు.తన సతీమణి ఝాన్సీని రెండుసార్లు, రవిబాబును ఒకసారి ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు నాలుగోసారి మళ్లీ మీ ముందుకు వస్తున్నానని తెలిపారు. ఈసారి కూడా భారీ మెజారిటీతో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.నిరంతరం రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉన్నానని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో నాలుగోసారి ప్రజల ముందుకు వస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news