నిజంగా ఇది చాలా విడ్డూరంగా ఉంది. అయితే కంపెనీ ఒక ఉద్యోగి మీద ఫిర్యాదు చేసింది. తను ఎక్కువ సమయం టాయిలెట్లో గడుపుతున్నాడని.. మేము వారంలో ఒకరోజు ఎక్కువ జీతం ఇస్తున్నట్లు అవుతోంది అని చెప్పింది. అయితే ఈ విధంగా కంప్లైంట్ రాసింది..
మా కంపెనీ లో ఒక ఉద్యోగి ఉన్నాడు. అతను చాలా మంచిగా పని చేస్తాడు. అయితే ఎప్పుడైతే తాను వర్క్ మొదలు పెడతాడో వెంటనే టాయిలెట్ లోకి వెళ్లి 20 నిమిషాల పాటు ఉండి మళ్ళీ వస్తాడు. తొమ్మిది గంటలకి వర్క్ మొదలు పెడితే తిరిగి తాను వచ్చేసరికి 9:30 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ రోజు లో రెండు నుంచి మూడుసార్లు టాయిలెట్ కి వెళ్తాడు.
ఇలా ప్రతిసారి కూడా 20 నిమిషాలు తీసుకుంటాడు. ప్రతి వారం తాను నాలుగు రోజులు పని చేస్తున్నాడని ఒకరోజు టాయిలెట్ లోనే ఉన్నట్లు అవుతోందని చెప్పింది. తాను టాయిలెట్ లోకి వెళ్లి ఫోను చూసుకుంటూ ఉంటాడు అని అయినా తనని మేము ఉద్యోగుల నుంచి తీసేయమని ఎందుకంటే అతను బాగా పని చేస్తాడని ఇది తప్ప ఇంకా ఏ ఇబ్బంది లేదని పని ఎంతో క్వాలిటీగా చేస్తాడు అని చెప్పింది.
అదే విధంగా ఆస్ట్రేలియా స్ట్రాంగ్ లేబర్ రూల్స్ ప్రకారం కూడా తీసేయడం కుదరదని చెప్పింది. ఈ విషయం విన్న వాళ్ళల్లో చాలా మంది ఉద్యోగి యొక్క మెడికల్ కండిషన్ చూడమని సలహా ఇచ్చారు. మరికొందరైతే స్మోకింగ్ చేసే వాళ్ళు ఇలా ఎక్కువ సేపు విరామాలు తీసుకుంటారని చెప్పారు. ఒక అతను అయితే ఎవరైనా నేను బాత్ రూమ్ కి వెళ్ళినప్పుడు లెక్క పెడితే నాకు తీవ్ర ఒత్తిడి వస్తుందని చెప్పారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది.