కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో విటమిన్ సి అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రతి ఒక్కరూ కమలాలను ఎక్కువగా తింటున్నారు.
అవును నిజమే రోగ నిరోధక శక్తి కమలాల వల్ల పెరుగుతుంది. అదే విధంగా దీని వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. కానీ చాలా మందికి వీటిపై అవగాహన లేదు. మరి ఆలస్యమెందుకు వాటి కోసం కూడా తెలుసుకుందాం..!
ఎముకలలో ఇబ్బందులు:
కమలా లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా విటమిన్ సి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల క్యాల్షియం తగ్గుతుంది. దీని కారణంగా ఎముకలు బలంగా ఉండవు. ఎముకల్లో సమస్యలు వస్తాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళు కమలాలకి దూరంగా ఉండటం మంచిది.
గుండెల్లో మంట:
కొద్దిగా కమలానని తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. హృదయానికి కూడా ఇది చాలా మంచిది. అదే విధంగా కళ్ళకి కూడా ఇది ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఒకవేళ కనుక మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే గుండెల్లో మంట, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
పళ్ళకి కూడా ఇది మంచిది కాదు. పంటిపై ఉండే ఎనామిల్ ని ఇది డ్యామేజ్ చేస్తుంది. ఇందులో ఎక్కువగా జ్యూస్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. ఇలా దీనివల్ల వివిధ సమస్యలు మనకి వచ్చే అవకాశం ఉంది.