తెలంగాణ కుర్రాడు… గల్లి క్రికెట్ టు చెన్నై సూపర్ కింగ్స్…..

-

నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో సిరిసిల్ల కుర్రాడు అవనిశ్ రావుని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఈ వేలంలో బేస్ ప్రైస్ అయినా 20 లక్షల రూపాయలకి కొనుగోలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ అసోసియేషన్ తరపున ఇండియా- ఎ టీం కి కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో విజయవాడ లో 163 పరుగులు చేసి బంగ్లాదేశ్ ని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.

18 సంవత్సరాల వయసున్న ఈ వికెట్ కీపర్ మరియు బ్యాటర్ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందినవాడు.ఒకవేళ జనవరి 19న ప్రారంభం కాబోయే అండర్ 19 ప్రపంచకప్ లో మెరుగైన ప్రదర్శనని కనబరిస్తే అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడే అవకాశము ఉంటుంది. అలాగే అతడు ఇండియన్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని నాయకత్వంలో మరిన్ని మెలుకువలు నేర్చుకొని ఇండియా టీం లో స్థానం దక్కించుకునే అవకాశాలు కూడా ఉండును. ఇవన్నీ సక్రమంగా జరిగితే తెలుగు కుర్రాడు సిరాజ్ తర్వాత అవనిష్ ని మనం ఇండియా టీం లో చూడవచ్చును.

Read more RELATED
Recommended to you

Exit mobile version