థియేటర్లలో రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. ఎక్కడ? ఎప్పుడు?

-

మరో 24 గంటల్లో అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశం మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరుకాబోతున్నారు.రామ మందిర ప్రారంభోత్సవ వేడుకను పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు.

 

 

మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం వీక్షించడానికి యావత్తు దేశం ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూపించడానికి మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ ఐనాక్స్ ,న్యూస్ ఛానెల్ ఆజ్ తక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని ఈ సంస్థల కో-ఫౌండర్ గౌతమ్ దత్తా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేలా తాము అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది.ఇప్పటికే ఆన్ లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉందగా….. టికెట్ ధర రూ.100 రూపాయలు . ప్రతి టికెట్‌పై పాప్ కార్న్ కాంబోను కూడా అందిస్తున్నమని తెలిపారు. ఇండియా లోనీ 160కి పైగా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news