ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.7 అడుగులతో జలకళ సంతరించుకుంది.
నాలుగు గేట్లు ఎత్తి నీటి విడుదల
పై ప్రాంతాల నుంచి వరద వస్తున్న వరద ఉధృతి కారణంగా ముందస్తు జాగ్రత్తగా నీటిని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దిగువకు ప్రాంతాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి సారెను సమర్పించారు. జలాశయం నాలుగు గేట్లు (5,6,7,8) ఎత్తి నాలుగు వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో ఇన్ ఫ్లో 3,62,095 క్యూసెక్కులు ఉండగా ..ఔట్ ఫ్లో 1,03,857 క్యూసెక్కులుగా ఉంది.