పాకిస్థాన్ 22వ ప్రధాన మంత్రిగా మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిండెంట్ హౌస్ లో రాష్ట్రపతి మమ్మూన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ తో పాటు ఇమ్రాన్ స్నేహితులు హాజరయ్యారు.
జాతీయ అసెంబ్లీలో శుక్రవారం ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో పీటీఐ అధ్యక్షుడుకి 176 ఓట్లురాగా.. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాబ్ (పీఎంఎల్-ఎన్) అధిపతి షాబాజ్ షరీఫ్ 96 ఓట్లు సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 342 మంద సభ్యులున్న పాక్ పార్లమెంటులో దిగువ సభలో ప్రభుత్వం ఏర్పాటుకు 172 ఓట్లు అవసరం కాగా ఇమ్రాన్కి 176 మంది మద్దతు లభించింది.