ఇండియా కూటమి లో తమకు సముచిత స్థానం దక్కడం లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కూటమి నుంచి వైదొలిగిన తర్వాత ఎన్డీఏ జతకట్టి బీహార్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ నిన్న నితీష్ కుమార్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ నేపథ్యంలో, సీఎం నితీశ్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు.బిహార్ సామాజిక న్యాయం కోసం చేసే పోరాటంలో మహాకూటమికి సీఎం నితీశ్ కుమార్ అవసరం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని ఏ రంగంలోనూ దళితులు, వెనుకబడిన తరగతులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బీహార్ లో పూర్ణియా వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.