నిరుద్యోగులను రెచ్చకొట్టి చిల్లర రాజకీయాలు చేయొద్దు :కాంగ్రెస్ నేత దయాకర్

-

మిస్టర్ కేటీఆర్.. దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ దగ్గరుకు రా.. 10 సంవత్సరాల పాలనలో ఎందుకు డీఎస్సీ వేయలేదు..? నిరుద్యోగులను రెచ్చకొట్టి చిల్లర రాజకీయాలు చేయొద్దు’ అంటూ టీపీసీసీ స్పోక్స్‌ పర్సన్ చనగాని దయాకర్ సవాల్ చేశారు.పేద పిల్లలకు చదువు, ఉద్యోగాలు ఆపే ప్రయత్నం చేస్తే పాపం తగులుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలపై కొందరు పింక్ బ్యాచ్ హింస వైపు మళ్లిస్తున్నారని అన్నారు.10 సంవత్సరాలు నిరుద్యోగులను గోస పెడితేనే బీఆర్ఎస్‌ను బొంద పెట్టారని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే 30 వేల మందికి ఉద్యోగ పత్రాలు అందజేశామని తెలిపారు.

దీంతో పాటు డీఎస్సీ ద్వారా 11 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడితే, బీఆర్ఎస్ దొంగ రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్లలో బడులను మూసివేసి, కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహించారని అన్నారు. అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులతో నిరసనలు, ధర్నాలు చేపించడం సిగ్గుచేటని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఓయూలో రాకేష్ రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు తరిమిన సిగ్గు రాలేదని అన్నారు. ఇలానే వ్యవహరిస్తే, బీఆర్ఎస్ నేతలను తరమాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version