నేటి నుంచి కోర్కెలు తీర్చే పండుగ ప్రారంభం

-

రొట్టెల పండుగకు సర్వం సద్ధం చేసిన అధికారులు..

నెల్లూరులోని స్వర్ణాల చెరువులో ఏటా నిర్వహించే రొట్టెల పండుగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాల నుంచి ఈ సంప్రదాయ పండుగకు సుమారు 15 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  భక్తులు దర్శించే బారాషాహీద్‌ దర్గాను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. దర్గా ఆవరణలో ఉన్న స్వర్ణాల చెరువులో స్నానం చేసి.. రొట్టె తీసుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

ఈ ఉత్సవాలకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దర్గా పరిసర ప్రాంతాల్లో సీసీ కెమేరాలు, డ్రోన్‌ల సాయంతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. మొత్తం రెండు వేల మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news