పీజీ మెడికల్ సీట్లలో లోకల్ రిజర్వేషన్ల కోసం కేంద్రం పై ఒత్తిడి తేవాలి : హరీశ్ రావు

-

పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ తీర్పు వల్ల స్థానిక విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 2025 నాటికి తెలంగాణలో ఉన్న 2,924 పీజీ సీట్లలో 50 శాతం లోకల్ రిజర్వేషన్ ప్రకారం.. 1,462 సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు వచ్చేవని.. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ 1,462 సీట్లు కూడా ఆల్ ఇండియా కోటాలోకి వెల్లిపోతాయని పేర్కొన్నారు.

తెలంగాణలో ఉంటూ మెడికల్ పీజీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది శరాఘాతంగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొనబోతున్నారని తెలిపారు హరీశ్ రావు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బతినే అవకాశముందని పీజీలో ఇన్ సర్వీస్ కోటా అనేది ప్రశ్నార్థకం అవుతుందన్నారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కాన్ స్టిట్యూషనల్ బెంచ్ కు వెళ్లాలని తీర్పు పై స్టే తీసుకురావాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు హరీశ్ రావు. 

Read more RELATED
Recommended to you

Latest news