తెలంగాణతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడుతెరపడనుంది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో విడుదలకానున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా దేశం మొత్తం చూపు తెలంగాణ రాజకీయాలపైనే ఉండటంతోనేటి ఫలితాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపనున్నాయి. పోలింగ్ కౌటింగ్ ప్రక్రియపై ఎన్నికలప్రధానాధికారి రజత్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణలోని31 జిల్లాల్లోని 43 లెక్కింపు కేంద్రాల్లో 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకుఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 42 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా, అత్యల్పంగా భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో 12 రౌండ్లలో జరగనుంది. 3,356 మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు 1,916 సూక్ష్మ పరిశీలకులు లెక్కింపుప్రక్రియలో పాల్గొననున్నారు. తొలి రౌండ్‌లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినతర్వాత తదుపరి రౌండ్లలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం12.30 గంటల కల్లా 3,4 రౌండ్లలో 60 వేల నుంచి 70 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుందనిపేర్కొన్నారు.