విజయ్ అట్లీ కాన్సెప్ట్ ఇదే..!

-

కోలీవుడ్ స్టార్ విజయ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈమధ్యనే సర్కార్ సినిమాతో సంచలన విజయం అందుకున్న విజయ్ తన 63వ సినిమా అట్లీ డైరక్షన్ లో చేస్తున్నాడు. తెరి, మెర్సల్ సినిమాల తర్వాత అట్లీ, విజయ్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా కథ కూడా కోలీవుడ్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఎప్పుడు యూనివర్సల్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేసే అట్లీ ఈసారి కూడా క్రీడా నేపథ్యంతో విజయ్ సినిమా చేస్తున్నాడట. 125 కోట్లు ఉన్న భారత దేశంలో ఒలంపిక్స్ కు వెళ్లే క్రీడాకారులు సంఖ్య వారు తెచ్చే పతకాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దీని మీద అట్లీ అద్భుతమైన కథ రాసుకున్నాడట. క్రీడాకారుల వెనుక జరిగే రాజకీయ పరిణామాలను కూడా ఈ సినిమాలో గట్టిగా చూపిస్తున్నారట. సో మరోసారి విజయ్ మరో వివాదాస్పద చిత్రాన్ని చేస్తున్నారన్నమాట. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news