పవన్ కి విలువైన కానుక ఇచ్చిన తల్లి అంజనా దేవి

-


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి మంగళవారం తన కొడుకు పవన్ కల్యాణ్ కి విలువైన కానుకను ఇచ్చారు. ప్రజల కోసం పనిచేస్తున్న, చేయనున్న జనసేన పార్టీకి తన వంతు ఫండ్‌గా రూ. 4 లక్షల చెక్‌ను పవన్‌కు అందచేశారు. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆనందంతో పొంగిపోయిన పవన్ చెక్‌ను పక్కనే ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కి చూపించి మురిసిపోయారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఇది అత్యంత విలువైన కానుక.. అంటూ పేర్కొన్నారు. జనసేన కార్యాలయానికి వచ్చిన తన తల్లిని ఆప్యాయంగా పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తల్లి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. తల్లితో ముచ్చటించిన తరువాత పవన్.. దగ్గరే ఉండే తన తల్లిని కారు ఎక్కించి ఇంటికి పంపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version