ఇటీవల విశాఖ మన్యంలో మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే కిడారిని ఉద్దేశించి రాజమండ్రి కవాతు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై కిడారి భార్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆమె జనసేన అధినేతకు వ్యతిరేకండా విశాఖ మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో అవినీతి పెరిగింది కాబట్టి మావోయిస్టులు మళ్లీ పుట్టుకొస్తున్నారంటూ…పవన్ పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. తన భర్త మరణం నుంచి ఇంకా కోలుకులేదని.. కిడారి ఎలాంటి వాడో ప్రజలకు తెలుసన్నారు… భర్తను కోల్పోయి విషాదంలో ఉన్న తమకు.. ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దన్నారు. మావోయిస్టు నేతదే ప్రాణమా.. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోములవి ప్రాణాలు కావా అంటూ ప్రశ్నించారు… కిడారి పరమేశ్వరి నిరసనకు ఈపీడీఎస్ఎల్ డైరెక్టర్ శోభా హైమావతి, ఇతర ఉద్యోగులు మహిళలు సంఘీభావం తెలిపారు.