రామ్ సినిమా ఏం చేస్తుందో..?

-

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తనలోని ఎనర్జి అంతా పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నాడు. నేను శైలజా హిట్ తర్వాత హైపర్, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు ఫ్లాప్ అవడంతో మళ్లీ రామ్ కెరియర్ లో వెనక పడ్డాడు. అందుకే ఈసారి క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేశాడు. ప్రస్తుతం రామ్ నటించిన సినిమా హలో గురు ప్రేమకోసమే. నక్కిన త్రినాథ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించారు.

రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పాతిక కోట్ల దాకా చేసిందని తెలుస్తుంది. ఫ్లాపుల్లో ఉన్న హీరోగా రామ్ సినిమా హిట్ అయితేనే అంత మొత్తం కలెక్ట్ చేయడం అటు ఇటుగా ఉంటే దిల్ రాజు ఏకంగా రామ్ మీద అంత బిజినెస్ ఎలా చేశాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది. టీజర్, ట్రైలర్ సినిమా అంత కొత్త కథలా అయితే అనిపించడం లేదు. ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version