నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తా: ఎమ్మెల్యే అనిల్

-

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ తమ అభ్యర్థుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తోంది. ఇప్పటికే తమ అభ్యర్థుల పేర్లతో 4 లిస్ట్లు విడుదల చేసింది. ఐదో జాబితాపై కూడా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొందరు సిట్టింగులు టికెట్లను కోల్పోగా, చాలా మంది సిట్టింగులు వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ అయ్యారు.

 

వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేయనున్నట్లు నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ‘ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తా. నిన్నటి దాకా అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి చంద్రబాబు నాయుడును ఢిల్లీలో తిడతా’ అని అనిల్ అన్నారు. బీసీకి ఈ సీటు ఇవ్వాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయులుకు మరోసారి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన వైసీపీకి ఇటీవల రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news