పార్లమెంట్‌లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగమే : రాహుల్ గాంధీ

-

ఇటీవల పార్లమెంటులోకి ఇద్దరు యువకులు చొరబడి పసుపు వాయువును విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో నిరుద్యోగం పెరగడానికి కారణం నిరుద్యోగ సమస్య అని రాహుల్ గాంధీ అన్నారు. యువకులు నిరుద్యోగ సమస్య వల్లే పార్లమెంటులోకి చొరబడి దాడి చేశారని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉండడం గురించి మీడియా మాట్లాడడం లేదని కేవలం పార్లమెంట్ లోనీ ఎంపీలపై పడుతున్న సస్పెన్షన్ వేటు గురించి మాట్లాడుతుందని అన్నారు. పార్లమెంటు బయట ఉన్నటువంటి సస్పెండ్ అయిన ఎంపీల వీడియోలు తాను రికార్డు చేయటాన్ని మాత్రమే మీడియా ప్రసారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 

పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలు సస్పెన్షన్ వేటుకి గురవడాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నినాదము తో నిరసనలకు పిలుపునిచ్చింది. ఇండియా కూటమికి చెందిన పలువురు నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని అన్నారు

.

 

Read more RELATED
Recommended to you

Latest news