పార్లమెంట్ నిందితులకు మరో 15 రోజులపాటు కస్టడీ పొడిగింపు…

-

పార్లమెంట్ భద్రత ఉల్లంఘన కేసులోని నిందితులకు పోలీస్ కస్టడీ జనవరి 5 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు తెలిపింది. నిందితులు సాగర శర్మ, నీలం దేవి, మనోరంజన్, అమూల్ షిండే కస్టడీని పొడిగించాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నిందితులకి 15 రోజులపాటు కస్టడీ పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. గతవారం వీరికి ఏడు రోజుల కస్టడీ విధించగా నేటితో కస్టడీ ముగిస్తున్న నేపథ్యంలో పోలీసుల యొక్క అభ్యర్థనను కోర్టు అంగీకరించి వారి యొక్క కస్టడిని పొడిగించింది.

 

పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి డిసెంబర్ 13వ తేదీకి 22 సంవత్సరాలు అయినవి .అదేరోజు మనోరంజన్ మరియు సాగర్ శర్మలు విజిటర్ పాసులతో పార్లమెంటులోకి చొరబడి వారి వెంట తెచ్చుకున్నటువంటి పొగ డబ్బాలను పేల్చారు. అమూల్ సిండే, నీలం దేవీలు అనే మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల ఇదే విధంగా ప్రవర్తించారు. ఈ కుట్రలోని ప్రధాన నిందితుడు లలిత్ ఝా ఇదివరకే పోలీసులు ముందు లొంగిపోయాడు ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version