ఎంతో మంది తమ ఇళ్లల్లో పావురాలని పెంచుతూ ఉంటారు. అలానే మహా నగరం లో లక్షల పావురాలకు పైగా ఉంటాయని సమాచారం. ఈ పావురాల సంఖ్య చాల ఎక్కువ. రోజూ కొన్ని వేల మంది వీటికి ఆహారం కోసం గింజలు వేస్తుంటారు. మీరు కూడా పావురాలకు గింజలు వేస్తారా…? అయితే తప్పకుండ ఈ విషయం గురించి తెలుసుకోవాలి.
ఇప్పుడు చాలా చోట్ల బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. చికెన్ తినడం వల్ల ఇది వస్తుందని, చనిపోయిన పక్షుల ద్వారా ఆ వ్యాధి వ్యాపిస్తుందని అని అందరికీ తెలిసినదే. అయితే తెలియని మరొక విషయం ఏమిటంటే…? పావురాల ద్వారా కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించవచ్చు. అయితే పావురాలు పెంచుకుంటున్నా, లేదా వివిధ ప్రాంతాల్లో పావురాలకు మేత వేస్తున్న.. ఈ అలవాటులని మానుకోవడం చాల మంచిది. చాల మంది పావురాలకు గింజలు వేసే అలవాటు ఉంది. ఇలా గింజలు వెయ్యడానికి 500 ప్రాంతాల్లో కేంద్రాలున్నాయి.
బర్డ్ ఫ్లూ కారణంగా పావురాల దగ్గరకి వెళ్లకుండా ఉంటె మంచిది అంటున్నారు నిపుణులు. వలస పక్షుల ద్వారా పావురాలకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది. మనం కనుక వాటి దగ్గరకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఎగిరితే వాటి రెక్కల నుంచి పెద్ద మొత్తం లో దుమ్ము కణాలు గాలిలో కలుస్తుంటాయి. ఇలా ఆ దుమ్ము ద్వారా వైరస్ మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ఈ అలవాటుని కొద్దీ రోజుల దాక మానుకోవడమే మంచి పని. లేదంటే హాని జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి గుర్తుంచుకోండి.