పెన్షన్ల ఊసే లేదు.. రైతుబంధు ప్రస్తావనే లేదు.. కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్సీ కవిత విసుర్లు..

-

ఈ నెల ఒకటిన పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు వాటి ప్రస్తావనే లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అన్నసాగర్‌లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కవిత పరామర్శించిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఒకటి రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని అసహనం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధుల పంపిణీ ఊసేలేదన్నారు. ప్రజా పాలనలో భాగంగా వచ్చిన 1.20కోట్ల దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు అర్థమవడం లేదన్నారు.

44 లక్షల మందికి కేసీఆర్ ప్రభుత్వము పింఛన్లు అందించిందని, వారికి పింఛన్ల మొత్తం పెంచి పంపిణీ చేయకుండా మళ్లీ దరఖాస్తులు తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒకవేళ 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తే కరెంటు బిల్లు ఎవరూ చెల్లించవద్దని పిలుపునిచ్చారు. అలాగే, హామీల అమలులో సూచనలు చేస్తామే తప్ప అభివృద్ధిలో తాము ఎక్కడా ఆటంకపర్చబోమని తెలిపింది.

 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని, ఇందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో తెలంగాణ అనే మాట మాట్లాడేది కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news