ప్రత్యేక హోదా బహుమతి కాదు..  అది మీ హక్కు ..రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తొలి సారి ఏపీకి వచ్చిన రాహుల్ గాంధీ మోదీ పాలన వైఫల్యాలను ఎండగట్టారు. కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ… 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది. ప్రధానిగా తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైలుపై పెడతామంటూ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అనేది బహుమతి కాదు…  అది ఏపీ ప్రజల హక్కు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత..మోదీకి ఐదు కోట్ల ఆంధ్రుల కళ్లలోకి చూసే దమ్ము లేదు.

దేశ ప్రజలకు అండగా, కాపలాగ ఉంటానన్న మోదీ దొంగలకు అండగా ఉన్నారని ఆరోపించారు. మాల్యా దేశాన్ని విడిచి లండన్ వెళ్లే ముందు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి జైట్లీని కలిశారని.. ఆ విషయాన్ని జైట్లీ ఏ స్వయంగా ప్రకటించారు. తొమ్మిది వేల కోట్ల ప్రజల సొమ్ముని దోచుకున్న మాల్యాకు మోదీ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు.  యుద్ధ విమానాల కొనుగోలులో నాటి సాంప్రదాయాన్ని కాదని ఎలాంటి అనుభవం లేని అనీల్ అంబానికి చెందిన కంపెనీకి యుద్ధ విమానాల  తయారీ కాంట్రాక్టును అప్పగించారన్నారు.

ఒక్కో యుద్ధవిమానాన్ని కాంగ్రెస్ హయాంలో 500కోట్లకు కొంటే… భాజపా ప్రభుత్వం 1600 కోట్లకు కొనడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news