బిగ్ బాస్-2.. నానికి పెద్ద డ్యామేజ్..!

-

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ రెండు వారాల్లో ముగియనుంది. తెలుగు ప్రేక్షకులకు అసలు ఏమాత్రం పరిచయం లేని ఓ క్రేజీ కాన్సెప్ట్ తో బిగ్ బాస్ షో మొదలైంది. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఎనర్జిటిక్ హోస్టింగ్ షోని సూపర్ సక్సెస్ చేసింది. ఎన్.టి.ఆర్ వచ్చేది శని, ఆదివారాలే అయినా బిగ్ బాస్ టీం ఇచ్చే స్క్రిప్ట్ ను తన సొంతంగా మార్చుకుని సందర్భాన్ని బట్టి హౌజ్ మెట్స్ కు చురకలు అంటించేవాడు.

నాని మాత్రం స్క్రిప్ట్ రాసిచ్చింది రాసిచ్చినట్టుగా చదివేస్తున్నాడు అన్న వాదన వినిపిస్తుంది. ఎన్.టి.ఆర్ తర్వాత స్మాల్ స్క్రీన్ పై నానికి ఆ ఛాన్స్ రావడం గొప్ప విషయమే అయినా నాచురల్ స్టార్ నానికి బిగ్ బాస్ ముందు ఉన్న ఫాలోవర్స్ కన్నా తరువాత ఉన్న ఫాలోవర్స్ తగ్గారని అంటున్నారు.

ముఖ్యంగా తానేదైతే చెబుతున్నాడో దానికి తన దగ్గర ఓ క్లారిటీ లేకపోవడం నానికి పెద్ద మైనస్. షో తప్పకుండా తనకు మరింత మంది అభిమానులుగా మార్చేస్తుందని భావించిన నానికి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇదవరకు నాచురల్ స్టార్ నానికి ఇప్పుడు కాస్త ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందనే అంటున్నారు.

ఏది ఏమైనా షో ముగింపు దశకు చేరుకుంది. ఓ పక్క కౌశల్ తన ఆర్మీ అండదండలతో ఒక్కడే సింగిల్ హ్యాండ్ ఫైట్ చేస్తుంటే మరో పక్క మిగతా ఐదుగురు ఇంటి సభ్యులు కౌశల్ మీద యుద్ధం ప్రకటించేశారు. మరి ఫైనల్ విన్నర్ ఎవరవుతారు అన్నది తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news