నాన్నకు అమ్మయింది! తండ్రికి లివర్ దానం చేసిన కూతురు

మనం స్కూల్స్ లో చదువుకున్నాం ఏమని… మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇంకా సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్.. లాంటి మహానుభావులు దేశం కోసం పోరాడి హీరోలయ్యారు. ఈవిషయం అందరికీ తెలుసు. ఎలా తెలుసు అంటే.. వాళ్ల గురించి పాఠ్యపుస్తకాల్లో ఉంటుంది. పెద్దలు కూడా చెబుతుంటారు. అవునా. కానీ.. ఇప్పుడు రియల్ లైఫ్ హీరోలు… మన మధ్యే తిరుగుతున్న హీరోల గురించి మనకు తెలుసా? వేరేవాళ్ల కోసం వాళ్ల లైఫ్ నే త్యాగం చేసేవాళ్ల గురించి ఎంతమందికి తెలుసు.

చాలా మంది తమ అవయవాలను దానం చేస్తారు. కానీ.. ఎప్పుడు.. వాళ్లు చనిపోయాక వాళ్ల అవయవాలు బాగా ఉంటే అప్పుడు వేరే వాళ్లకు డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. లేదా బతికున్నప్పుడే డబ్బుల అవసరం ఉంటే కిడ్నీ, లివర్ లాంటి అవయవాలను కొంతమంది అమ్ముకుంటుంటారు. కానీ.. సొంత తండ్రి కోసం ఓ కూతురు తన లివర్ ను దానం చేసి హీరో అయింది. కూతుళ్లు అంటే కేవలం చదివించి పెళ్లి చేసి పంపించడమే. వాళ్లు తర్వాత తల్లిదండ్రులనే పట్టించుకోరు.. అనే అర్థాన్ని తిరగరాసింది ఈ కూతురు.

ముంబైకి చెందిన పూజ బిజార్నియా తన తండ్రికి లివర్ ను దానం చేసింది. తన తండ్రికి లివర్ చెడిపోవడంతో తన లివర్ ఇచ్చి తనకు లైఫ్ ఇచ్చిన తండ్రిని కాపాడుకొని అసలు సిసలు కూతురనిపించుకున్నది పూజ. ఇక.. పూజ లివర్ దానం చేసిన విషయాన్ని తనకు ఆపరేషన్ చేసిన రచిత్ భూషన్ అనే డాక్టర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. నెటిజన్లు తండ్రి ప్రాణాలు నిలబెట్టిన ఆ కూతురుకు సలాం చేస్తున్నారు. మీరు పైన చూసిన ఫోటోలో తండ్రీకూతుళ్ల కడుపు మీద ఆపరేషన్ తర్వాత ఏర్పడిన మచ్చలను కూడా చూడొచ్చు.