ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, పీఈసీ సభ్యులు హాజరు అయినారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని సీఎం ఆరోపించారు. ‘ బీఆర్ఎస్ ను ప్రజలు ఇప్పటికే బొంద పెట్టారు అని అన్నారు.
గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే.. రాజకీయ కుట్రతో కేసిఆర్ వాయిదా వేస్తున్నారు. ప్రొ.కోదండరాం గొప్పతనం ఒకరు చెప్పాలా? తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడం దారుణం అసహనం వ్యక్తం చేశారు . వాళ్ల చెప్పులు మోసే వారితో కోదండరాంను బీఆర్ఎస్ పోల్చడంలో ఏమైనా అర్థం ఉందా?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.